చందానగర్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలోని చందానగర్‌లో భారీచోరీ జరిగింది. ఇటీవల కాలంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులుపట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వ్యాపారి నివాసంలో గుర్తుతెలియని దుండగులు 30 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో కంటిమీద కునుకులేకుండా దొంగతనాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఆదమరిస్తే అంతే మన సొత్తు తస్కరణకు గురవుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. సాధ్యమైనంత త్వరగా దొంగలను పట్టుకొని సొమ్ము రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.