చందానగర్: ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని వేధించడమే కాకుండా మరో పెళ్లి చేసుకుంటానని భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఓ గృహిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చందానగర్ ఎస్‌ఐ సైదులు కథనం ప్రకారం.. బెల్ ఎంఐజీకి చెందిన ఖాసిం కూతురు రిజ్వాన్‌బేగం(32)కు అత్తాపూర్‌కు చెందిన షేక్ ఖదీర్‌తో 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో రిజ్వాన్‌ను భర్త వేధింపులకు గురి చేస్తున్నాడు.
పెద్దలు నచ్చచెప్పినా అతనిలో మార్పురాలేదు. మరో పెళ్లి చేసుకుంటానని 15 రోజుల క్రితం ఖదీర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతున్న రిజ్వాన్ శనివారం తాను అద్దెకుండే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు మృతురాలి సోదరుడు అమ్జద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




