Tuesday, 3 November 2026

పాతాళగంగలో విరిగిపడుతున్న కొండచరియలు

కర్నూలు : శ్రీశైలం సమీపంలోగల పాతాళగంగలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి కొండచరియలు విరిగి పైనుంచి పడుతున్నాయి. దీంతో భక్తులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాక వచ్చే నెల 12వ తేదీ నుంచి జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులు అక్కడ జరుగుతుండగా కొండచరియలు విరిగిపడుతుండడంతో ఆ పనుల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే అక్కడగల రోప్ వే రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *