చంద్రబాబు అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తుంది
ప్రధాని నరేంద్ర మోదీ లేకుంటే బాబు జీరో
2019 కంటే ముందే ఇచ్చిన హావిూలు అమలు చేస్తాం
సుజల స్రవంతి పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుంది
బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు
విశాఖపట్నం, జూన్20(జనం సాక్షి) : రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ, అవినీతి పాలనను సాగిస్తున్నారని, చంద్రబాబు అసమర్థ, అవినీతి పాలనపై బీజేపీ పోరాటంచ ఏస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహా సంపర్క్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన బుధవారం విూడియాతో మాట్లాడారు. పరిపాలనలో చంద్రబాబు లయ తప్పారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేకుంటే చంద్రబాబు జీరో అని బీజేపీ నేత అన్నారు. చంద్రబాబు అసర్ధ, అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. పోలవరం ముంపు మండలాల గురించి వెంకయ్యనాయుడు రాజ్యసభలో మాట్లాడుతుంటే సీఎం రమేష్ అడ్డుపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విభజన హావిూల గురించి పోరాడని పార్టీలు దుష్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇచ్చిన హావిూలు అమలు చేయడంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉందన్నారు. పోలవరం, రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ హావిూలను 2019 కంటే ముందే అమలు చేస్తామని సోము వీర్రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో పోలవరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. 2016 వరకు చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నించారు. పోలవరం వెనుక చాలా జరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమన్నారు. సుజల స్రవంతి పథకంలో టీడీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. కేంద్రం ఇచ్చిన నిధులను టీడీపీ భారీగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. బీజేపీ రాజకీయాలు కోసం పనిచేయదు.. కమిట్‌మెంట్‌తో పనిచేసే పార్టీ. సీఎం రమేష్ ఏపీ, తెలంగాణకు సమన్యాయమంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. వరంగల్‌కు చెందిన టీడీపీ ఎంపీ పోలవరంను వ్యతిరేకించారు.. ఇదా తెలుగుదేశం పార్టీ కున్నా నిబద్దత అని సోమువీర్రాజు నిలదీశారు. రైతుల రుణమాఫీ సక్రమంగా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. చెట్టు-నీరులో అవినీతి ఆగిందా. టీడీపీ మేనిఫెస్టో ఇచ్చిన హీమాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిధులను పక్కదారి పట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై బీజేపీ ప్రశ్నిస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ డిపార్ట్‌మెంట్‌లో చూసినా అవినీతే రాజ్యమేలుతుందని, రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. కార్మికులు ఎక్కువగా ఉన్నచోట ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. కానీ.. విజయవాడలో ఏర్పాటు చేయడమేంటని’ బీజేపీ నేత విరుచుపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. వీఆర్వోలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ జీతాలు పెంచడం లేదని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించమని నాయిబ్రాహ్మణులు కోరితే.. వెలేత్తి చూపి చంద్రబాబు బెదిరించారని, ఆసలు చంద్రబాబు వైఖరి సరిగా ఉందా అని అనుమానంగా ఉందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకు సంబంధించి ఏలాంటి సహాయసహకారాలు ఇవ్వాలో కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, కానీ, దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం బదులు ఇవ్వలేదన్నారు. ఆఫిడవిట్‌లో ఒక్క పేజీ అంశాన్ని పక్కన పెట్టి, పెద్ద చర్చ చేస్తున్నారని, పులివెందులలో దివంగత నేత వైఎస్సార్ డైరీ టెక్నాలజీను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం రమేష్ ఇంటి సవిూపంలోనే కాల్వలు తవ్వారని, కానీ చుక్క నీరు రాదని, విశాఖకు రైల్వే జోన్, కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వడం బీజేపీ లక్ష్యమని సోము వీర్రాజు పేర్కొన్నారు.పోలవరాన్ని 2014లో ప్రారంభించకుండా ఎత్తిపోతల పథకాలను ఎందుకు ప్రారంభిచారని ప్రశ్నించారు. ఆ తర్వాత 2016లో పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు ప్రారంభించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై చర్చ జరగాలని బీజేపీ నేత సోము వీర్రాజు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎక్కవ సమయం వేచ్చిస్తోందని బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రెండు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో, 22, 23 తేదీలో విజయనగరం, 24నపోలవరంలో పర్యటించనున్నారని సోమువీర్రాజు తెలిపారు.