Wednesday, 4 November 2026

చంద్రుని మించిన

అందాల మోముతో అరవిరిసిన కల్వ పూల కన్నుల బాల
మా ఇంట పండించావు రతనాల పంట
కాలాన్ని కరిగించి ప్రేమలు పంచావు
మా ఇంట నడయాడిన వేళ నీవు సౌభాగ్య లక్ష్మీ అయ్యావు
వసంతాల పూలజల్లుతో చందమామ కిరణాల జాలంతో
ఎదిగిన పూలరెమ్మలాగా అందమైన తీగకు పందిరి అలిన పూవుగా విరిసి
మల్లెపువ్వులా
నాజూకుగా పైపైకి ఎదిగిపోయిన
కాలం కనురెప్పల్లో నీవు జీవితానందాలను కురిపించిన పసిడి బొమ్మగా
చదువుల తల్లి వసంతకాలపు మమకారాలు అద్దిన నీవు
అమ్మానాన్నలకు మరువలేని అనుబంధాన్ని ప్రేమ తీగలను చుట్టి
కాపాడిన తల్లి నీ భాగ్యాల వల్లి ఎల్లప్పుడూ విజయలక్ష్మి గా అన్నింటిలో రాణించిన నీవు పతి సతులు ఇద్దరు ఆది దంపతుల్లా వెలగాలి
దీపావళి పర్వదినాల మీ ఇల్లే నవకాంతుల జాబిల్లిగా రాణించాలి
నీ నవ్వులే వెన్నెల పువ్వులై విరాధిల్లాలి తల్లిదండ్రులకు
మెట్టినింటికి పుట్టినింటికి ఒక వంతెనల
అనురాగ సిరులను కురిపించిన ఆదర్శ మహిళగా సంఘంలో రాణించావు
ఉద్యోగ సత్యోగాలలో నీకు నీవే సాటనిపించుకున్నావు
నయనాల తారవై నిలిచావు మా అందరికీ గుండెల్లో ఎడబాయని అనురాగాలు పంచిన తల్లి మా ఇంటికే కల్పవల్లివి నీవు వర్ధిల్లమ్మ వర్ధిల్లు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు, ఖమ్మం భువనగిరి కోట 7702537453