Wednesday, 4 November 2026

చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తా :సినీనటుడు శ్రీహరి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:తను రాజకీయాల్లోకి వస్తే చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తానని సినీనటుడు శ్రీహరి అన్నారు.కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఆయన అన్నారు.’మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’అని చెప్పుకునేటట్లు తన పాలన ఉండదని ఆయన తెలిపారు.తనకు ఉన్న పలుకుబడితో ఎప్పుడైనా ఎమ్మెల్యే కాగలనని ఆయన అన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయం త్వరలో చెబుతానని శ్రీహరి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *