హైదరాబాద్ : సత్యం కేసు దోషులను చర్లపల్లి జైలకు తరలించారు. పది మందిని ప్రత్యేక పోలీసు వాహనంలో జైలుకు తరలించారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామలింగరాజుతో పాటు పది మంది దోషులకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.




