హైదరాబాద్: ఉత్తమ సేవలు అందించినందుకు గాను చర్లపల్లి జైలుకు ఐఎస్ ఓ సర్టిఫికేట్ లభించింది. దేశంలోనే అతి పెద్ద జైలుగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకు కూడా ఈసర్టిఫికేట్ ప్రదానం చేయనున్నారు. కేంద్ర కారాగారంలో పరిశ్రమల పనితీరు, ఖైదీలకు అందిస్తున్న భోజనం, వారికి కల్పిస్తున్న సౌకార్యాలు, జైలులో పండిస్తున్న పంటలు, కేంద్ర కారాగారంలోని వివిధ పరిశ్రమల్లో ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, ఖైదీలకు అందిస్తున్న వైద్య సేవలు, వివిధ బ్యారక్‌లో ఖైదీలకు అందిస్తున్న సేవలు, పారిపాలనా విభాగం పనితీరుపై అధ్యయనం చేసిన కమిటీ.. ఈ సర్టిఫికెట్ జారీ చేసిన్నట్లు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ కొలను వేంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు.




