నెన్నెల, మే 7, (జనంసాక్షి )నెన్నెల మండల కేంద్రంలోని మండల వనరుల కార్యాలయం వద్ద ఆదివారం మంచిర్యాల సాక్షి అగ్రికల్చర్, టీయూడబ్ల్యూజె (ఐజెయూ ) జిల్లా ఉపాధ్యక్షుడు, పాత్రికేయుడు కొండు శ్రీనివాస్ తన తాత కొండు లస్మయ్య, నానమ్మ దుర్గమ్మ, తల్లి మల్లక్క జ్ఞాపకార్థంగా చలివేంద్రం ప్రారంభించారు. మండు వేసవిలో బాటసారులు, ప్రయాణికుల దాహం తీర్చడానికి తన వంతు ప్రయత్నంగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ఆయన తండ్రి కొండు శంకరి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రంలో ప్రతి రోజు మినరల్ వాటర్ తో పాటు వారంలో ఒకరోజు ఉచితంగా చల్ల, మజ్జిగ, జొన్న అంబలి పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట మధు, విశ్వ బ్రాహ్మణ Sirf మండల అధ్యక్షుడు దురిశెట్టి రవీందర్ చారి, కొండు బాపు, బక్కయ్య, వైకుంఠం, రమణ, కృష్ణ, శివ, నవీన్, శశి, రమేష్, పాత్రికేయులు పాల్గొన్నారు.




