కొండమల్లేపల్లి ఏప్రిల్ 10 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా శ్రీ సాయి స్టోన్ క్రషర్ మరియు మహాలక్ష్మి స్టోన్ క్రషర్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని రైతుబంధు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కేసాని లింగారెడ్డి మాట్లాడుతూ ప్రజల దాహార్తి తీర్చుకునేందుకు ఎండాకాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా మట్టికుండలలో చల్లటి నీళ్లు ప్రజలకు అందించేందుకు చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రయాణికులు ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగంధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీను, మాజీ వార్డు సభ్యులు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు
చలివేంద్రం ప్రారంభించిన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి




