శామీర్ పేట్, జనం సాక్షి :దేవరయాంజాల్ మాజీ సర్పంచ్,అల్వాల్ సొసైటీ మాజీ చైర్మన్,ఉమ్మడి షామీర్పేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు,నిస్వార్థంతో ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఆలయాలు,పాఠశాలల నిర్మాణం మురికి కాల్వల నిర్మాణం,రోడ్లు,కమ్యూనిటీ హాళ్లు, ఇందిరమ్మ ఇండ్లు,ప్రభుత్వం నుండి ప్రజలకు అందియ్యడానికి కృషి చేసినారు,అదేవిధంగా అల్వాల్ సొసైటీ చైర్మన్ గా ఉన్నప్పుడు రైతుల సంక్షేమం కోసం కృషిచేసిన నాయకుడు పీసరి శ్రీనివాస్ రెడ్డి 75 వ జన్మదిన సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయాంజాల్ లోని వీర హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలువురు నాయకులు పీసరి శ్రీనివాస్ రెడ్డి ని శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు ప్రజలకి చేసిన సేవలను కొనియాడారు,ఆయురారోగ్యాలతో ఉండి మునుముందు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి,తూంకుంట మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షులు పట్నం నర్సింహారెడ్డి,రామాలయం మాజీ ధర్మకర్త టీచర్ పట్నం నర్సింహారెడ్డి,మాజీ వార్డు సభ్యులు మనిగొండ శ్యామ్,దేవరయాంజాల్ రెడ్డి సంఘం అధ్యక్షులు కట్ట శశిధర్ రెడ్డి,రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు పట్నం రామచందర్ రెడ్డి,పూజారి సీతారామచార్యులు,తదితరులు పాల్గొన్నారు.
పీసరి శ్రీనివాస్ రెడ్డి జన్మదినంన గుడిలో ప్రత్యేక పూజలు




