హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు పట్ల కేంద్రంపై మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ఒత్తిడి తేవాలని రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లడుతూ జూన్ 14న జరిగే చలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని చెప్పారు. బైండోవర్ కేసులకు ఎవరు భయపడవద్దని, ప్రభుత్వం చలో అసెంబ్లీని అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు.




