;- పూసల సంఘం రాష్ట్ర నాయకులు గుంటుపల్లి
;-సమ్మయ్య, మంథని డివిజన్ అధ్యక్షులు కావేటి సమ్మయ్య
జనంసాక్షి , మంథని : ఈనెల 26వ తేదీన సోమవారం పెద్దపెల్లిలోని అమర్నగర్ సిరి ఫంక్షన్ హాల్ లో జరగబోయే పూసల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పూసల సంఘం రాష్ట్ర నాయకులుగుంటుపల్లి సమ్మయ్య, మంథని డివిజన్ అధ్యక్షులు కావేటి సమ్మయ్య లు పిలుపునిచ్చారు. పూసల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం శాసనసభ్యులు కోరు కంటి చందర్, బీసీ కార్పొరేషన్ ఈడీ హాజరవుతున్నారనిపెద్దపెల్లి జిల్లా, మంథని రామగుండం నియోజక వర్గాల లోని పూసల కులస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన పూసల కులస్తుల ఐక్యత చాటాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంటుపల్లి సమ్మయ్య, మంథని డివిజన్ అధ్యక్షులు కావేటి సమ్మయ్య, కావేటి శ్రీనివాస్, కావేటి రవి, చేను రవి, గుంటుపల్లి సతీష్, గుంటుపల్లి గురువేశ్, పూసల మహిళలు కావేటి పద్మ, కావిటి రమ్య, కావేటి ఎల్లమ్మ, కావేటి రాజేశ్వరి, కావిటి లక్ష్మి , చిన్న పెళ్లి జమున , చిన్న పెళ్లి కవిత , చేను రాదా, గుంటుపల్లి లతా , చేను లక్ష్మీ, ముద్ర కోల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




