Tuesday, 3 November 2026

దాతల సహకారం అభినందనీయం – సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి

రామగిరి, జనం సాక్షి :ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి అన్నారు.
శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో కల్వచర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సౌమిత్రి నారాయణాచార్యులు, సౌమిత్రి వేదవ్యాసాచార్యులు, సౌమిత్రి పరంకుశాచార్యులు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులైన సుగుణ, గిరి లతో కలిసి సర్పంచ్ బుక్స్, పెన్సిల్,పెన్స్, తదితర వస్తువులను అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు గ్రామాలలోని దాతలు సహకరిస్తే పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు . విద్యాభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పాఠశాలకు సహకారం అందించి దాత్రుత్వాన్ని చాటుకున్న సౌమిత్రి కుటుంబ సభ్యులకు గ్రామం తరుపున, విద్యార్థుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు దాతలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యారంగంలో రాణించాలని ఆమె కోరారు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనజ, చంద్రశేఖర్ రెడ్డి , ఉప సర్పంచ్ వేము కనకయ్య, నాయకులు గంట వెంకటరమణారెడ్డి కోలిపాక సత్తయ్య, కొలిపాక సారయ్య, విద్య కమిటీ ఛైర్మెన్ యాదగిరి ఓదెలు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.