Wednesday, 4 November 2026

చలో సచివాలయం ఆందోళనలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ చేపట్టిన చలో సచివాలయ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి సచివాలయం వరకూ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకువెళ్లేందుకు యత్నించడంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి సమీప పోలీసుస్టేషన్‌కు  తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *