బెల్లంపల్లి, మార్చి 1, (జనంసాక్షి )
చల్లంగ చూడు ఎల్లమ్మ తల్లి అని పూజలు చేశారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బుధవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద గల రేణుకా ఎల్లమ్మ కళ్యానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముకేశ్ గౌడ్, నాయకులు భీమా గౌడ్, ప్రమోద్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
చల్లంగ చూడు ఎల్లమ్మ తల్లి.




