చల్లా సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్ అలంపూర్ జనం సాక్షి (డిసెంబర్ 10) బీ ఆర్ఎస్ పార్టీ లోకిఅలంపూర్ మున్సిపాలిటీ నాల్గవ వార్డు కాంగ్రెస్ కాన్సిలర్ ఇంతియాజ్ శనివారం హైదరాబాదులో మాజీ ఎమ్మెల్యే చల్లా సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి కే సీ ఆర్ సమక్షంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి చేరిన సంగతి తెలిసినదే. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంతియాజ్ బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా చల్లా వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ చల్లా వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలోనే అలంపూర్ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమై టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. చల్లా వెంకట్రాంరెడ్డి ఆదేశానుసారం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
చల్లా సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్




