చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు

ఝరాసంగం సెప్టెంబర్ 26 (జనంసాక్షి).
చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని ఎస్ ఐ రాజేందర్ రెడ్డి, అన్నారు.
మంగళవారం ఝరాసంగం పంచాయతీ కార్యాలయం ఆవరణలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 128 వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని , తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ ,ఎంపీటీసీ రజిని ప్రియ నాయకులు ,ఏజాజ్ బాబా ఎంపీ నగన్న ,బి,సంగమేశ్వర్, విజేందర్ రెడ్డి,రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి శ్రీశైలం, రాష్ట్ర నాయకులు కొల్లూరు రాజకుమార్, శ్రీనివాస్ ,లక్మాన్,మహేష్ , శివన్న రాములు ,దత్తు పండరీ వెంకట్ ,రాజు నర్సింలు,రజక బంధువులు తదితరులు పాల్గొన్నారు.