Friday, 6 November 2026

చాగాపురం లోఘనంగా బాలల దినోత్సవం

చాగాపురం లోఘనంగా బాలల దినోత్సవం ఇటిక్యాల జనంసాక్షి (నవంబర్ 14)మండలం లోని చాగపురం గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో భారత మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాని పురస్కరించుకుని సోమవారం ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా
నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు .అనంతరం
బాలల దినోత్సవాన్ని పురష్కరించుకొని విద్యార్థులకు చిత్రలేకనం ,పాటలు,వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు డీ. విజయభాస్కర్ , ఉపాధ్యాయులు మోహన్,తవీటినాయుడు,శేఖరయ్య,హరిబాబు,తిరుపతి,కరీం,హేమలత,విద్యార్థులు పాల్గొన్నారు.