Friday, 6 November 2026

మైనింగ్ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి మట్టి అక్రమ రవాణా

మైనింగ్ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి మట్టి అక్రమ రవాణా
తిరుమలగిరి (సాగర్) నవంబర్ 14, (జనంసాక్షి):
మండల కేంద్రంలో కొత్తగా వెలుస్తున్న అనుమతులు లేని వెంచర్లలో మైనింగ్ డిపార్ట్మెంట్ కళ్ళు గప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టిని భారీ వాహనాలతో అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. వెంచర్ల లోకి మట్టిని తరలించడానికి పట్టా భూమిని అయినా సరే మైనింగ్ శాఖ అనుమతులు తప్పనిసరి కాగా, నిబంధనలు తుంగలో తొక్కి అధికారులు తమ చెప్పుచేతల్లో ఉన్నారని, మట్టిని భారీ టిప్పర్లతో తరలిస్తూ గ్రామీణ ప్రాంత రోడ్లను సైతం ధ్వంసం చేస్తూ ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ, తమకు హద్దు అదుపు లేదని చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వారికి తోడ్పాటునందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రజాప్రతినిధుల సహకారం కూడా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతివేగంగా ప్రమాదకరంగా వెళ్తున్న భారీ వాహనాల పట్ల చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి రావలసిన రెవిన్యూను కాపాడుతూ అక్రమార్కుల ఆటలు కట్టించాలని , ప్రజల కోరుతున్నారు. ఇప్పటికీ గతంలో అనుమతులు లేని వెంచర్లలో మట్టిని తరలించినప్పటికీ అధికారులు స్పందించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు