హైదరాబాద్, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించారు. త్వరలో పార్టీ తరపున భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.




