మాఫియాగా మారిన టీఆర్‌ఎస్‌ నాయకులు – కిషన్‌రెడ్డి

నిజామాబాద్‌, మార్చి 30: బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు పెడితే సహించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సారా, ఇసుక, అక్రమ నిర్మాణాలతో టీఆర్‌ఎస్‌ నాయకులు మాఫియాగా మారారని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలు గడప దాటడం లేదు’ అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.