చార్మినార్: ప్రపంచ వారసత్వ(హెరిటేజ్) దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం చార్మినార్, గోల్కొండ సందర్శనకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు కన్సర్వేటర్ డాక్టర్ గోపాల్‌రావు తెలిపారు. చార్మినార్ వద్ద విద్యార్థులకు హెరిటేజ్ కట్టడాలపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. ఉత్తమ హెరిటేజ్ గార్డియన్ అవార్డులను పోలీసులకు అందజేస్తారు. చార్మినార్ తూర్పు దిశలో ఉండే కొత్త ద్వారాన్ని సోమవారం ప్రారంభిస్తారు.




