Tuesday, 3 November 2026

చిత్తాపూర్ సర్పంచ్ అందరికి ఆదర్శం

నెన్నెల, జూన్ 2, (జనంసాక్షి )భావితరాల భవిష్యత్ కు మంచి వాతావరణం నెలకొల్పేందుకు చిత్తాపూర్ సర్పంచ్ బత్తిని పద్మవెంకటేష్ గౌడ్ చేస్తున్న కృషి అందరికి ఆదర్శం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశంసించారు. శుక్రవారం నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామ బస్టాప్ వద్ద సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాన్ని చాటి చెప్పే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం మండలానికే గర్వకారణం అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలందరు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. రేపు చిత్తాపూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద జరిగే రైతు ఉత్సవాల్లో రైతన్నలు అధిక సంఖ్యలు పాల్గొనాలని భోజన సౌకర్యం వివిధ వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమపథకాలను ప్రజలు గుర్తించాలని, ప్రతి పథకం విజయవంతంగా అమలై ప్రజలు అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, మండల రైతు బంధు సమితి ఆధ్యక్షులు గడ్డం అశోక్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ మల్లేష్, ఎంపీటీసీ ఓరేం కమల, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్, నాయకులు ఎంబడి మహేందర్, రాంచందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాంచందర్, బానేశ్, శ్రీనివాస్, మొండయ్య, బెతూ పాపయ్య తదితరులు పాల్గొన్నారు