కొత్తగూడ జూన్ 2 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ శోభ రాణి కి రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం,అవార్డు దక్కింది.ఈ అవార్డు కై సుమారుగా 15 సంవత్సరాలు ఎలాంటి రీమార్క్ లేకుండా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తే మాత్రమే లభిస్తుంది.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్క్రిస్ట్ సేవా పతకం అందుకున్నారు.ప్రస్తుతం కొత్తగూడలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ శోభారాణి 20 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో చేరి సేవలందిస్తున్నారు.
ఉత్తమ సేవలకు పురస్కారం




