చిత్తూరు: తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రేణిగుంట మండలం మామండూరు వద్ద టాటా సుమో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు కడప జిల్లావాసులుగా గుర్తించారు.




