హైదరాబాద్, (మార్చి 9): హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన చిన్నారుల కిడ్పాప్ ఉదంతం సుఖాంతమైంది. రెండు రోజుల క్రితం నల్లకుంటలో కిడ్నాప్ చేసిన ఐదేళ్ళ మమతను లేడీ కిడ్పాపర్లు ఏ.ఎస్.రావు నగర్ వద్ద విడిచి పెట్టారు. రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళా కిడ్నాపర్లు నల్లకుంటలో ముగ్గురు చిన్నారులను కిడ్పాప్ చేశారు. వారిలో ఇద్దరు చిన్నారులను అదేరోజు సాయంత్రం విడిచి పెట్టారు. మూడో చిన్నారి మమతను మాత్రం సోమవారం ఏఎస్‌రావు నగర్ వద్ద విడిచి పెట్టారు.




