చిన్నారి వైద్య ఖర్చులకు సహాయం అందించిన ఆధరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సోషల్ సర్వీస్ కొండమల్లేపల్లి జనవరి 13 జనం సాక్షి న్యూస్ : చింతపల్లి మండలం కురుమేడు గ్రామానికి చెందిన గోరంటి నరేష్ పుట్టిన వారం రోజుల లోపే ఈ పాపకు ఊపిరితిత్తుల వ్యాధి మరియు మెదడు వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారిని బి.యన్.రెడ్డి లోని సంరక్ష హాస్పిటల్ లో చేర్పించడం జరిగినది నరేష్ సొంత డబ్బులతో ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసిన సరిపోకపోవడంతో దాతల సహకారం కోరడమైనది. అందులో భాగంగా ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఈ చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం ఆదరణ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ సోషల్ సర్వీస్ చైర్మన్ పందిరి జ్యోతి వెంకన్న హాస్పిటల్ లోకి వెళ్లి చిన్నారి నీ చూసి ఆరోగ్యం గురించి వాకబు చేసి చిన్నారి తండ్రి నరేష్ కు 13,250రూపాయలో అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పందిరి వెంకన్న జ్యోతి కేతనాద్ స్వామి శేర్పల్లి కళ్యాణి సముద్రాల వెంకన్న కుమ్మనేని ఆంజనేయులు ఆలంపల్లి పద్మ సముద్రాల సింహం రేణుక దాచుపల్లి రమేష్ ఆలంపల్లి ప్రవీణ్ లకుమారపు మల్లయ్య గుండా రాజారావు నీలిమ సముద్రాల ఆనంద్ దివ్య మల్లికా తదితరులు పాల్గొన్నారు
చిన్నారి వైద్య ఖర్చులకు సహాయం అందించిన ఆధరణ




