మెట్ పల్లి అంబెడ్కర్ స్టేడియం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
మెట్పల్లి టౌన్, జనవరి 13,
జనంసాక్షి :
50 లక్షల రూపాయలతో మెట్పల్లి అంబేద్కర్ స్టేడియంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేడియంలో మిగులు పనులను పూర్తిచేసేలా
సిఎస్ఆర్ నిధులనుండి 50 లక్షలు రూ తక్షణ మంజూరు చేయడం జరిగిందని ఇవి గాక ఏమైనా పనులు మిగిలిన మరికొంత నిధులు కేటాయించి స్టేడియం పూర్తిస్థాయి పనులు చేస్తామని స్టేడియంలో క్రీడాకారులకు ఏ ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయి పనులు చేస్తానని నియోజకవర్గంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా స్టేడియాన్ని పూర్తి చేస్తానని అన్నారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు ,ఎంపీపీ మారు సాయిరెడ్డి కౌన్సిలర్ ధ్యానపెల్లి వరలక్ష్మి, రాజారాం, మన్నే ఖాన్, కోఆప్షన్ మార్గం గంగాధర్, బర్ల సాయన్న జావిద్,ఓజ్జెల శ్రీనివాస్, లింగంపల్లి సంజీవ్,అరిసెల మురళి ,జక్కం బాబు,సుధాకర్ గౌడ్ ,అధికారులు ఏఈ అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లి అంబెడ్కర్ స్టేడియం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు




