ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం:సర్పంచ్ తప్పేట రమేష్
జనం సాక్షి, చెన్నరావు పేటమండలంలోని లింగాపురం గ్రామంలోనీ అంగన్వాడీ సెంటర్ లలో చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా గ్రామంలోనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.పోషణ పక్ష ర్యాలీలో సర్పంచ్ తప్పేట రమేష్ మాట్లాడుతూ చిరు ధాన్యాలలో ఔశధ గుణాలు కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఎన్నో వ్యాధులను నివారించుటలో చిరుధాన్యాలు తొడ్పాడుతాయని ముఖ్యంగా ఉబకాయం,అర్థరైటీస్,మధుమేహం,కోలేస్ట్రాల్,మరియు గుండె సంబంధిత వ్యాధులకు ప్రత్యేక ఆహారంగా తీసుకోవచ్చని ప్రాణాంతకమైన క్యాన్సర్ లను కూడా నివారిస్తాయని,ముఖ్యంగా గర్భిణీలు,చిన్న పిల్లలకు ఆహరంగా ఇవ్వాలని చిరుధాన్యాలలో ఖనిజలవణాలైన,ఇనుము, జింక్,మెగ్నీషియం,పాస్పరస్,ఫోలిక్ఆసిడ్,రైభోఫ్లెవిన్ అను విటమిన్స్ అధిక సంఖ్యలో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుతాయానీ అన్నారు,ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్వేత,అంగన్ వాడి టీచర్ ఊర్మిళ ఉపాధ్యాయులు సురేష్,ఇంద్ర కర్ణాకర్,చిప్ప పరమేశ్వర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చిరు ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం:సర్పంచ్ తప్పేట రమేష్చిరు




