Tuesday, 3 November 2026

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.

ఫొటో : వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు.
బెల్లంపల్లి, మార్చ్ 29, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందుకు జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఠాకూర్ మణి రామ్ సింగ్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఎన్నో పథకాలు అమలు చేశాడని, పట్వారి విధానాన్ని రద్దుచేసి, అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యము తదితర పథకాలు ప్రవేశపెట్టినాడని అన్నారు. అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 41 సంవత్సరాలు గడిచిందన్నారు. అనంతరం ఉట్ల జీవరత్నం మాట్లాడుతూ సింగరేణి బిఆర్ఎఫ్ లోకి వెళ్లినప్పుడు సింగరేణి కాపాడుకున్నామని, శఎన్టీఆర్ పేదల పాలిట పెన్నిధి అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జ్ గద్దల నారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఎన్నో పథకాలు అమలు చేశామని, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నీరు, నిధులు, నియామకాలు, పథకాలన్నీ అమలు చేయకుండా పేదల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ వ్యవస్థను పాలిస్తుందన్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వం కల్వకుంట్ల వారికి పరిమితమైందని ఆయన ఆరోపించారు. ఈకార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకుడు మేడి పున్నం చందర్, శ్రీనివాస్, బొల్లం మల్లయ్య, ఎండి అసన్, యాదగిరి, దూడపాక రవి, గోకర్ల శేఖర్, కాసర్ల వెంకటేష్, లలిత, పట్టణ అధ్యక్షురాలు సునీత, కార్యకర్తలు పాల్గొన్నారు