Thursday, 5 November 2026

విభజన హావిూలన్నీ నెరవేర్చాలి

ఏలూరు,మార్చి26  (జ‌నంసాక్షి) : రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని జిల్లా కాంగ్రెస్‌  నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.  ప్రత్యేక రాష్ట్ర ¬దా విషయంలో కూడా కేంద్రం తీరును ప్రజలతో కలిసి ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హావిూలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ బిల్లుతో పేదలు నష్టపోతారని తెలిసి కూడా భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. దేశంలోని పలు రాజకీయ పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నా భాజపా మాత్రం దీన్ని అమలు చేయాలనుకోవడం దురదృష్టకరమని అన్నారు.పోలవరం ప్రాజెక్టు, 2019లో కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *