హైదరాబాద్,(జనంసాక్షి): ఆర్టీసీ యాజమాన్యానికి గుర్తింపు సంఘాలకు జరిగిన చీకటి ఒప్పందంతో కార్మికులు నష్ట పోయారని ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ఆరోపించారు. యాజమాన్యానికి లొంగి ఈయూ, టీఎంయూలు ఆర్టీసీ కార్మికులను దగా చేశాయన్నారు. యాజమాన్యంతో సంఘాలు చేసుకున్న ఒప్పందాలన్నీ చీకటి ఒప్పందాలని ఆయన అన్నారు. సమ్మెకు అన్ని యూనియన్లు మద్దతిచ్చినప్పటికి, డిమాండ్లను నెరవేర్చడంలో ఈయూ, టీఎంయూలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు.




