Wednesday, 4 November 2026

రైతుల రుణాలు మాఫీ చేస్తాం: చంద్రబాబు

తిరుపతిలో ఏర్పాటు చేసిన తెదేపా ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ రైతులు రుణాలు మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. ఎరువలు, విత్తనాలు దరలు పెరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. రైతులకు 9 గంటల కరెంటు ప్రకటిస్తామన్నారు. 32 మంంది కాంగ్రెస్‌ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒరిగిందిఏమి లేదని విమర్శించారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను బుట్టదాఖలు చేసిందన్నారు. ఉత్తరాఖండ్‌ వరద బాధితులను స్వస్థలాలకు పంపేందుకు తెదేపా తీవ్రంగా కృషి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. స్థానిక సంస్థలకు పద్దతి ప్రకారం ఎన్నికలు నిర్వహించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *