Tuesday, 3 November 2026

చుక్కాల బోడు గ్రామంలో పార్టీ జెండా నావిస్కరించిన ఎమ్మెల్యే

టేకులపల్లి, ఏప్రిల్ 5( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని చుక్కాల బోడు గ్రామంలో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ గద్దె పై బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించిన సందర్భముగా గ్రామస్తులంతా చేరుకొని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో కొన్ని అంతర్గత రహదారులు మిగిలిపోయాయని, సిమెంట్ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మెర్ల  వరప్రసాద్, చీమల సత్యనారాయణ, భూక్య కిషన్  నాయక్, బోడ బాలు నాయక్, లక్కినేని శ్యామ్, బర్మవత్ శివకృష్ణ, పూల్ సింగ్, ఆంతోటి రాకేష్, భూక్య పాప నాయక్, భూక్య తావూరియా నాయక్ తదితరులు ఉన్నారు.