Tuesday, 3 November 2026

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం చురుగ్గా కదులుతోంది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు సైతం చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల ఉత్తర కోస్తాలో పలు చోట్ల , దక్షిణకోస్తాలో కొన్ని  చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *