చెక్కడు… చప్పరించేస్తాడు…!

ఈ వయసులో లాలీపాప్‌ చప్పరిస్తున్నాడని లోకువగా చూసేరు..ఇతడో శిల్పి… అయితే…శిల్పాలను చెక్కడు..చప్పరించేస్తాడు! సింగపూర్‌లోని చైనాటౌన్‌ వద్దకు వెళ్తె..మనకు కన్పిస్తాడు.పేరేంటో తెలియదు..కాని..డబ్బులిస్తే..మన మఖాన్ని తదేకంగా చూస్తూ..లాలీపాప్‌ను నోట్లో పెట్టుకుని..దాని మీద ఇలా చెక్కిపెడతాడు..సారీ..చప్పరించిపెడతాడు.ప్రస్తుతం ఈ లాలీపాప్‌ శిల్పికి సంబందించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్‌ చేస్తోంది.