Monday, 2 November 2026

చెన్నైకి వాయువ్య దిశలో తీవ్ర వాయుగుండం

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైకి వాయువ్వ దిశలో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు,  దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటలకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది, రాగల 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. మచిలీపట్నం, వాడరేపు. కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడు నంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. తదుపరి సమాచారం అందేవరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *