చెప్పినట్టు వినలేదని.. మర్మాంగాన్ని కోసేసింది

హాంగ్‌జౌ (చైనా) (సెప్టెంబర్ 18): ఒక క్షణం పాటు విచక్షణ కోల్పోయిన ఓ మహిళ తన ప్రియుడి జీవితాన్ని అంధకారంలోకి తోసేసింది. కేవలం తన మాట వినడం లేదని ఆవేశపడి కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన ఈశాన్య చైనాలోని హాంగ్‌జౌ అనే నగరంలో జరిగింది.
హాంగ్‌జౌకు చెందిన లియు (50) వివాహితుడు. అయినా జాంగ్ అనే మరో మహిళతో పదేళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నాడు. అదే క్రమంలో గత ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్‌లో రూమ్ తీసుకుని ప్రియురాలితో ఆనందంగా గడుపుదామనకున్నాడు. అయితే ఆ రాత్రి లియుకు, జాంగ్‌కు మధ్య చాలా సమయం వాగ్వివాదం జరిగింది. భార్యను పూర్తిగా విడిచిపెట్టి తనతోనే ఉండమని ఆ మహిళ బలవంతం పెట్టింది. దానికి లియు అంగీకరించలేదు.తన భార్యను విడిచి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి నిద్రకు ఉపక్రమించాడు. అయితే కొంత సమయం తర్వాత చాలా నొప్పిగా అనిపించి కళ్లు తెరిచి చూశాడు. తన మర్మాంగం కనపడలేదు. ఆ ప్రాంతమంతా రక్తంతో నిండి ఉంది. వెంటనే బట్టలు అక్కడే విప్పేసి అండర్‌వేర్‌తోనే హాస్పిటల్‌కు పరిగెత్తాడు. అయితే ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, జాంగ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.