Wednesday, 4 November 2026

నేడు దేవరకొండలో ఎస్సై రమేష్ అంత్యక్రియలు…

నల్గొండ : ఎస్సై రమేష్ భౌతికకాయం ఆయన స్వస్థలమైన నల్గొండ జిల్లాలోని చెరుపల్లి షేర్ పల్లి తండాకు చేరుకుంది. ఇవాళా దేవరకొండలో రమేష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. రెండు రోజుల రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ లో రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రమేష్ మృతితో ఆయన భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. కన్నీటిపర్యంతమయ్యారు. గుండెలవిసేలా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం ఐఎస్ గా రమేష్ 2012లో విధుల్లో చేరాడు. 2015 ఆగస్టు 15న మంత్రి చేతుల మీదుగా రమేష్ ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నాడు. రమేష్ ది ఆత్మహత్య కాదని.. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇది రాజకీయ హత్యని.. దీని వెనుకాల అధికార పార్టీ నేతలు, ఇసుక మాఫియా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. రమేష్ హత్య వెనుక రూరల్ సిఐ, టౌన్ సిఐ, స్థానిక ఇసుక వ్యాపారి లక్ష్మణ్ నాయక్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.మరోవైపు రమేష్ మృతికి నిరసనగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. బంద్ లో టిడిపి, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. దేవరకొండ బస్టాండ్ వద్ద తలపెట్టిన ధర్నాలో టిడిపి అధ్యక్షుడు బిల్యానాయక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *