Thursday, 5 November 2026

చెరువులు కుంటలపై బెస్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి

చెరువులు కుంటలపై బెస్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి
బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు
నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
చెరువులు కుంటల లో చేపల పెంపకానికి బెస్త కులస్తులకు ప్రాధాన్యత నివ్వాలని రాష్ట్ర బెస్త సంఘం అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు కోరారు. నవంబర్ 21ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చెరువులు కుంటలలో నీటి నిలువలు పెరిగి మత్స్య సంపద పెరుగుతున్న తరుణంలో వాటిపై ఇతర కులాల వారి పెత్తనం బెస్తలకు ఇబ్బందిగా మారిందని, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెరువులు,కుంటలు నిండి మత్స్య సంపద పెరిగిన ఈ తరుణంలో చెరువులపై ఇతర కులాల ఆధిపత్యం పెరగడం ఆందోళనకరంగా, బెస్తవారి జీవనోపాధికి గండి పడే విధంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఒక తెలుగు దినపత్రికలో ముదిరాజులు అని హెడ్డింగ్ పెట్టి రాసిన వ్యాసం ఏమాత్రం అవగాహన లేకుండా రాసారని ఆ పత్రిక యాజమాన్యానికి కులాల పట్ల అవగాహన లేకుండా కులవృత్తుల పట్ల అవగాహన లేకుండా మిడి మిడి జ్ఞానంతో రాసినటువంటి విషయాలు రేపటి చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.నిజానికి అనాదిగా చేపలు పట్టడమే జీవనాధారంగా బతుకుతున్న బెస్తలను విస్మరించేటువంటి ఒక దురుద్దేశం ఈ పత్రిక ఈరోజు చేసింది. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలో చెరువుకుంటల మీద బెస్తలకే తొలి ప్రాధాన్యత అని చెప్పినప్పటికీ ఈ రోజు దాన్ని విస్మరించి ముదిరాజులను ముందుకు తీసుకొచ్చేటువంటి కుటిల ప్రయత్నం జరుగుతుందని, వాస్తవానికి ముదిరాజులు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందినటువంటి కులమైన క్రిమిలేయర్ గా గుర్తించబడినటువంటి కులమైన ముదిరాజులను ఇయాల ఏకంగా బీసీఏ జాబితాలో చేర్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడడమే కాకుండా, నేడు చెరువుల మీద కూడా ఆధిపత్యాన్ని సాధించే పరిస్థితి దాపురించిందన్నారు .నిజానికి అధికంగా జన సంఖ్య ఉండడం మూలంగానూ లేకుంటే వారికి రాజకీయ ప్రాబల్యం ఉండడం మూలంగానూ లేదంటే వాళ్లు ఇతర పార్టీలలో చేరి స్థానిక ప్రభుత్వాన్ని బెదిరించడం మూలంగానూ ఇయ్యాల ముదిరాజులకు పెద్దపీట వేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతున్నదని, బెస్తలను ప్రథమ స్థానంలో గుర్తించినటువంటి ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించి ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడితే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బెస్త బంధువులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి సోమయ్య, జిల్లా అధ్యక్షులు మంగిలిపల్లి కిషన్ గౌరవ సలహదారులు గొంగిడి లక్ష్మణ్, గుండు మల్లయ్య , ఇటికల నర్సయ్య, అంబటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.