అంగన్వాడీలో ఆన్లైన్ విధానం రద్దు చేయాలి
జహీరాబాద్ నవంబర్ 21 (జనం సాక్షి)అంగన్వాడీలో ఆన్లైన్ విధానం రద్దు చేయాలిపని భారం తగ్గించాలి.
ఐదు సంవత్సరాల టీఏడీఏలను తక్షణమే ఇవ్వాలి అని కోరుతూ
సిఐటియు ఆధ్వర్యంలో సిడిపిఓ కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు. డిమాండ్స్ పరిష్కారం చేయాలని సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ జీతం తక్కువ, పని ఎక్కువ చందంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల శమను దోపిడి చేస్తుందని అన్నారు. చేసిన పనిని ఆన్లైన్ లో ఫీడ్ చేయాలనే నిబంధనతో సెల్ఫోన్లు ఇచ్చిన ప్రభుత్వం అంగన్వాడీల చదువుకు తగ్గట్టు యాప్లు అర్థం కాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, మ్యానువల్ తో పాటు ఆన్లైన్లోనే ఫీడ్ చేయాలని నిబంధన సరైంది కాదని తక్షణమే ఆన్లైన్ విధానం రద్దు చేయాలని అన్నారు. అనేక సమావేశాలకు వచ్చిన టీచర్స్ కు టిఏ,డిఏ ఇవ్వకపోవడం సరైనది కాదని, కేవలం జహీరాబాద్ లొనే ఒక్కో టీచర్ కు 21,000 పైన టిఎ,డిఎలు రావాల్సి ఉందని, వీటితోపాటు బిఎల్ఓ డబ్బులు రావాలని, డ్యూటీ వేధింపులు కూడా ఆపాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ జహీరాబాద్ ప్రాజెక్ట్ అధ్యక్షులు శోభ, నాయకులు అమృత, రెహన, అంజమ్మ, శాంతమ్మ, తదితరులు ఉన్నారు.
అంగన్వాడీలో ఆన్లైన్ విధానం రద్దు చేయాలి




