చెరువుల పరిరక్షణ కమిటీలు వేయండి -హైకోర్టు

 

హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి):రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చెరువుల ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్రంలో అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీల్లో సంబంధిత జిల్లా ఎస్పీ సభ్యుడిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ కమిటీలు అక్రమణలను గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ అంశంపై డిసెంబరు 10 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.