Thursday, 5 November 2026

చెల్లెలిపై అత్యాచారయత్నం

హైదరాబాద్‌, మార్చి 24: తోడబుట్టిన అన్నయ్యే దారుణానికి ఒడిగట్టాడు. చెల్లెలిపై కన్నేసి.. కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. అయితే, వ్యవహారం బెడిసి కొట్టడంతో ఆ ప్రబుద్ధుడు ఊచలు లెక్కిస్తున్నాడు. నగరంలోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. చెల్లిపై ఓ అన్న అత్యాచారయత్నం చేయబోయాడు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని స్థానికులకు సమాచారం అందించడంతో అతడిని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *