Wednesday, 4 November 2026

చెవుడుకు చెక్‌పెట్టె కొత్త పరికరం

లండన్‌: వంశపారంపర్యంగా వచ్చె చెవుడుతో బాదపడుతున్న వారికి శుభవార్త.అలాంటివారు అన్ని ధ్వనులను స్పష్టంగా వినేందుకు తోడ్పడే..సరికొత్త పరాకరాన్ని స్కాట్లాండ్‌కు చెందిన ఎడిన్‌బర్గ్‌ వర్శిటీ శాస్త్రవేత్తలు రూపోందించారు. ‘బోన్‌ బ్రిడ్జ్‌’ గా పిలుస్తున్న ఈ పరికరాన్ని చెవి పై బాగంలో శస్త్రచికిత్స ద్వారా అమరుస్తారు,దీనిలో శరీరం బయటకు కనిపించే
భాగం ధ్వనులను గ్రహించి…పుర్రె ఎముకల ద్వారా చెవిలోపలి భాగానికి చేరవేస్తుంది.అక్కడి నుంచి మెదడుకు సంకేతాలు వెళ్లి,ధ్వనిని వినగలుగుతారు.అయితే…”వంశపారంప్య చెవుడుతో బాదపడుతున్న వారికి సాదారణ వినికిడి పరికరాల వల్ల లాభం ఉండదు. అలాంటివారికి ‘బోన్‌బ్రిడ్జ్‌’ అద్బుతంగా తోడ్పడుతుంది.కొన్నేళ్లలేనే ఇది అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ పరికరాన్ని బ్రిటన్‌ హగ్‌కు ప్రయోగాత్మకంగా అమర్చాం. అది అద్బుతంగా పనిచేస్తుంది” అని ఈ పరికరం రూపకర్తల్లో ఒకరైన అలెక్స్‌ బెన్నెట్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *