హైదరాబాద్:శేషాచలం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మరో ఐదు మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేసేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతినిచ్చింది. మొత్తం ఆరు మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే నిమ్స్‌లో ఫోరెన్సిక్ వైద్యులు లేనందున… ఉస్మానియా, లేదా గాంధీ ఆస్పత్రిలోని ఫోరెన్సిక్ వైద్యుల బృందాన్ని పంపాలని ఆదేశించింది. దీంతో శశికుమార్‌తో పాటు.. మురుగన్, మునుస్వామి, మూర్తి, మహేంద్రం, పేరుమాళ్‌ల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం జరగనుంది. వీరి బంధువులు అభ్యర్థనమేరకు… న్యాయస్థానం రీ-పోస్టుమార్టానికి అనుమతిచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మరో 5 మృతదేహాలకు రీ పోస్టుమార్టం




