Wednesday, 4 November 2026

చేర్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5కే రన్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 03 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం ఉదయం చేర్యాల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూపరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ రెడ్డి, చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు ఎస్ఐలు భాస్కర్ రెడ్డి, చంద్రమోహన్ కురుమ, నారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు,డాక్టర్లు, యువకులతో కలసి 5కె రన్ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య చేర్యాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని,ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు యోగా, రన్నింగ్, వాకింగ్, ధ్యానం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్ ఆడెపు నరేందర్, స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు పిల్లి ఆనంద్, ఉమేష్, అంబాల వెంకటేశం, నవీన్, పీటీలు రఫత్ ఉమర్, రమేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.