గద్వాల నడిగడ్డ, జూన్ 3 (జనం సాక్షి);తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం జూ4 ను పురష్కరించుకుని పోలీస్ శాఖ అధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె. సృజన తెలిపారు.పోలీస్ బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ ర్యాలీ,గద్వాల పట్టణం లోని వైయస్సార్ చౌక్ నుండి ఉదయం 10:00 గంటలకు పోలీస్ బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ ర్యాలీ ప్రత్యేక బ్యాండ్ మేళం తో ప్రారంభమై జమ్మిచెడుకు చేరునాని,బరోసా ఓపెన్ హౌస్జిల్లా కేంద్రం లోని బిరెళ్లి చౌరస్తా నందు ఉన్న బరోసా కేంద్రం నందు ఉదయం 11:40 గంటలకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడునాని,జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో జిల్లా లోని ఇండోర్ స్టేడియం నందు సాయంత్రం 04:30 గంటలకు ప్రత్యేక బృందం అయిన నిత్య చైతన్య కలారి అకాడమీ తో కలరిపాయట్టు యుద్దకళ* విన్యాసాలు ప్రదర్శన, కళ బృందం కార్యక్రమo నిర్వహించబడునాని,ఈ కార్యక్రమం లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ కోరారు.రాత్రి 7:00 గంటలకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విధులలో ప్రతిభ కనబరచిన పోలీస్ అధికారులకు బహుమతులు ప్రదానోత్సవం తరవాత జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులకు,జిల్లా స్థాయి అధికారులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు సాముహిక విందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.




