గాంధీకి నిజనిర్ధారణకు వెళ్లిన మహిళా సంఘం నేతల అరెస్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):మహబూబ్నగర్ చెందినటువంటి ఇద్దరూ యువతులు వారి బంధువుల వైద్యం నిమిత్తం గాంధీ హాస్పిటల్ లో వచ్చినప్పుడు వారిపై అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మత్తు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన టువంటి సంఘటనపై ఈరోజు ఉదయం మహిళా సంఘం సభ్యులు ఈ సంఘటన పై వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వారిని అరెస్టు చేసి లాలగూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. అత్యాచార సంఘటనల్లో కనీసం మహిళలు మాట్లాడే హక్కు ను కోల్పోతున్నారు. సంఘటన వివరాలను తెలుసుకొని విచారణ జరిపించాల్సిన ప్రభుత్వాలే మహిళా సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం అప్రజాస్వామికం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. గాంధీ హాస్పటల్ లో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి .ఇది మొదలు కాదు దీని లో ఏదో కుట్ర దాగి ఉందని చైతన్య మహిళా సంఘం భావిస్తోంది. కాబట్టి దీనిపై పూర్తి విచారణ జరిపి ఈ అత్యాచారాల్లోఉన్నత స్థానాల్లో వున్న వారిని వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు విధించాలని చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది.