– 9 మంది మావోయిస్టుల మృతి
ఖమ్మం : చత్తీస్గఢ్-ఆంధ్రా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఖమ్మం జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. 150 మంది మావోయిస్టుల బెటాలియన్ సమావేశం నిర్వహిస్తుందనే సమాచారంతో పోలీసుల విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.




